A Case study on Tribal women vegetable farmers

A case study on Tribal women vegetable farmers marketing problems
A case study on Tribal women vegetable farmers marketing problems

 

A case study on Tribal women vegetable farmers marketing problems
A case study on Tribal women vegetable farmers marketing problems: 

చింతూరు సంత

ఇప్పటి చింతూరు డివిజన్ లో ఆదివారం మోతుగూడెం సంత, సోమవారం రేఖపల్లి సంత, మంగళవారం జీడిగుప్ప సంత, బుధవారం చింతూరు సంత, గురువారం కుంట సంత, శుక్రవారం ఎదుగుర్రాల్లపల్లి సంత, శనివారం రోజు నెల్లిపాక సంత. రోజుకో సంత – సంత  సంతకో ప్రత్యేకత.

ఇప్పుడు చింతూరు లో ప్రతిరోజూ సంతే. చుట్టూ ప్రక్కల గ్రామాలనుండి గిరిజనులు తాము పెరట్లో లేదా తోటలో పండించిన కూరగాయలను , ఆకు కూరలను ప్రతి రోజు చింతూరు సెంటర్ కు తీసుకువచ్చి అమ్ముతున్నారు. 1 కిలోమీటర్ నుండి 15 కిలోమీటర్ ల దూరం నుండి 1. చుటూరు, 2. ఏ.జి, కోడేరు, 3. బొజ్జరాయిగూడెం, 4. నిమ్మలగూడెం, 5. ఎర్రంపేట, 6. కారంగూడెం, 7. మల్లెతోట, 8. తుమ్మల, 9. చింతూరు, 10. తుమ్మల , 11. సర్వేల, 12. రత్నపురం, 13. కుయుగూరు, 14. తిమ్మిరిగూడెం, 15. బ౦డారుగూడెం, 16. చట్టి, 17. ములకనపల్లి , 18. లింగాపురం, 19. వీరపురం గ్రామాలనుండి మహిళలు ఈ కూరగాయలను తీసుకువస్తుంటారు. 35 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఎక్కువ 50 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వృద్దులు 10 శాతం మండి ఉంటారు. మేము జనవరి 11,12,16 తేదీలలో జరిపిన పరిశీలన ఆధారంగా ఒకరోజు 44 మంది గిరిజన మహిళలు కూరగాయలు తెచ్చి ప్రధాన రహదారి ప్రక్కన పెట్టుకొని అమ్ముకుంటున్నారు. వీరు తూకం వేసి అమ్మరు మొదటి నుండి వీరు తాము తెచ్చిన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కానీ ఇతర ఉత్పత్తులు కానీ  కుప్పలుగా ఏర్పాటుచేసి కుప్ప ఒకటి పది రూపాయలకు అమ్మేవారు ఇప్పుడు ఇరవై రూపాయలకు పెంచారు. బెండకాయలు, దొండకాయలు, వంకాయాలు, తమటాలు, గోరుచ్క్కుడు ఏవైనా కుప్ప ఇరవై మాత్రమే. ఆకుకూరలు పదికి గోంగూర, తోటకూర అయితే 3 కట్టలు, పాల కూర , చుక్క కూర అయితే రెండు కట్టలు ఇస్తారు [కిక్కల్ కుసిర్, నాగేల్ కుసిర్ ఆకుకూరలు సీజన్ లో తెస్తారు] చింతపండు సీజన్ లో 4 చిన్న ముద్దలు ఇరవై రూపాయలు. చింతచిగురు, ఏలక్కాయలు, సీతాఫలాలు, నారింజకాయలు, జామకాయలు, బొప్పాయి కాయలు, అనపకాయలు, గుమ్మడికాయలు, మామిడికాయలు సైజ్ రకం బట్టి రేటు చెబుతారు. బేరం కూడా బాగానే చేస్తారు. ఎంతబెరామ్ ఆడినా చివర్లో “కొసర్” అని వాళ్ళే మరికొంత ఇస్తారు. ఉదాహరణ కు దొండకాయలు కొన్నప్పుడు కుప్పాలో ఉన్నవి కాకుండా మరికొన్ని కొసరు గా ఇస్తారు.

 

ప్రధాన రహదారి కి ఇరువైపుల రోడ్డుపై గుడ్డ లేదా ప్లాస్టిక్ సాంచి పరిచి , సినిమా హాల్ రోడ్ లో చర్చ్ గోడకు అనుకోని చిన్న ప్లాస్టిక్ షీట్ ఏర్పాటు చేసుకొని కూరగాయలు అమ్ముతారు. రోడ్ పై అమ్మే వాళ్ళు ఉదయం 8.30 నుండి 9.00 గంటల లోపు చేరుకుంటారు , మధ్యాహ్నం వరకు  సరుకు అమ్ముడు అయ్యంతవరకు సుమారు 3 – 4 గంటల పాటు ఎండలో ఉండాల్సి వస్తుంది. అంతే కాకుండా ఏ వైపు నుండి ఏ బండి వాడు వచ్చి తగిలిస్తాడో అనే భయం ఉంటుంది. ట్రాఫిక్ లోనే ఉండి వ్యాపారం చేయాలి. దీనికి తోడు బక్కచిక్కిన ముసలి మూతకను చూసిన పట్టణ ప్రయాణికులకు భలే సరదాగా బేరం ఆడాలనిపిస్తుంది. ఇంత తక్కువనా, అంతా రెటా ? బాలేవే అనే కామెంట్లు. సగం మంది వారం పొడుగునా ప్రతి రోజు వస్తారు, కొందరు, 4, 5 రోజులు మాత్రమే వస్తారు. వీళ్లలో స్వయంగా పండించిన వారు కొందరైతే, తమ గ్రామం లో లభించే  ఏ విధమైన అమ్ముడు బోయే సరుకైన తెచ్చి మారుబెరానికి అమ్ముకోనేవారు కొందరు. మారు బెరానికి అమ్ముకొనే వాళ్ళకి రోజుకి రూ.200/- నుండి రూ.300/- కులీ గిట్టుబాటు అవుతుంది. అదే స్వంతంగా పండించిన రైతులు రోజు కి రూ.1,000/- నుండి 2,000/ అమ్ముతారు. మేము సర్వే చేసిన రోజు 44 మంది మహిళలు మొత్తం రూ. 19,300/- వ్యాపారం చేసినట్లు చెప్పారు

Tribal women vegetable farmers marketing
Tribal women vegetable farmers marketing